AP: కృష్ణా జిల్లాకు చెందిన ఎస్సార్ సిబ్బందిపై ప్రభుత్వం వేటు వేసింది. సోషల్ మీడియా పోస్ట్ కేసులో ఓ నిందితుడు అరెస్ట్ అయ్యాడు. అయితే వాయిదాల విషయంలో జైలుకు, కోర్టుకు తరలించే సమయంలో ఖైదీలతో కలిసి ఎస్సార్ సిబ్బంది హోటల్లో టిఫిన్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.