BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని తెలంగాణ ప్రజానీకానికి తనదైన శైలిలో పాలన అందించాలని తెలిపారు.