కోనసీమ: అమలాపురం రూరల్ మండలం కామనగరువు బడుగు వారి పేటలో ఇవాళ సాయంత్రం బేతాళ స్వామి చెడీ తాలింఖానా మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఈ మహోత్సవానికి రావాలని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకి శనివారం రాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాలు అందించారు. ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.