JGL: బుగ్గారం మండలంలోని సిరికొండలో ప్యాక్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.