TPT: తిరుమలలో భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి శనివారం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి సేవలో పాల్గొనటం ఆనందంగా ఉందని చరణి మీడియాతో తెలిపారు.