ప్రకాశం: కనిగిరి పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మునగా మాలకొండయ్య శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పలువురు బీజేపీ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, అభివృద్ధికి మాలకొండయ్య ఎంతగానో కృషి చేశారని నాయకులు గుర్తుచేసుకుంటున్నారు.