NLR: వరికుంటపాడు మండలం రామదేవులపాడు గ్రామ రామాలయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఆలయంలోని అమ్మవారి తాళి బొట్టును దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.