E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండ రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.