NZB: మెండోరా మండలం బుస్సాపూర్‌లో అక్రమంగా తరలిస్తున్న 46 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై సుహాసిని ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. SI మాట్లాడుతూ.. అక్రమంగా బియ్యం తరలిస్తున్న సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. బాల్కొండకు చెందిన వినీష్, నిర్మల్‌కు చెందిన సూఫియాను అదుపులోకి తీసుకొన్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి, బియ్యం సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.