WGL: ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా వరంగల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో మంగళవారం ఉదయం GRP సీఐ సురేందర్ నేతృత్వంలో GRP, RPF సిబ్బంది ప్రయాణికులు, అనుమానితులు, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా GRP పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ, ప్రయాణికులకు సూచించారు.