WGL: రోగి శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా నయం చేయడం వైద్యుడి కర్తవ్యమని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. తాను వైద్యురాలిగా రాణించి, ప్రస్తుతం ప్రజా సేవా మార్గంలో అడుగు పెట్టానని, తెలంగాణలో వైద్య విద్య విస్తరణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.