రాగుల్లో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. రాగుల్లో ఉండే కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. బరువు అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.