KRNL: కోసిగిలోని ఉరుకుంద ఆర్చ్ సమీపంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో MLA వై. బాలనాగిరెడ్డి తన సొంత నిధులతో తాగునీటి బోరు ఏర్పాటు చేశారు. గురువారం వైసీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి భూమిపూజ చేసి బోరును ప్రారంభించారు. నీటి ఎద్దడి ఉందని MLA దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సమస్యను పరిష్కరించడం పట్ల MLAకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.