ADB: వర్షపు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో యువరాజ్ సూచించారు. మనబడి- మన నీరు కార్యక్రమంలో భాగంగా గురువారం ఉట్నూర్ పట్టణంలోని జడ్పీ ఆశ్రమ పాఠశాలలో ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీంతో ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పల్లు అధికారులు పాల్గొన్నారు.