NLG: దామరచర్ల, శ్రీనివాసనగర్ గురుకులాల్లో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. నియోజకవర్గంలోని గురుకుల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధిస్తే రూ. లక్ష డొనేషన్ అందజేస్తానని హామీ ఇచ్చారు.