NLG: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం, తెలుగు భాష బలోపేతం కోసం కాళోజీ నారాయణరావు చేసిన కృషి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని సామాజిక వేత్త డాక్టర్ రాజు అన్నారు. ఇవాళ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడలోని మేరెడ్డి రామచంద్రారెడ్డి గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాళోజీ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని కోరారు.