ASR: విద్యార్థుల వ్యక్తిగత హాజరు 75 శాతం తగ్గకుండా చూడాలని డీఈవో బ్రహ్మాజీరావు ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కొయ్యూరు మండలం డౌనూరు ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు పరిశీలించారు. విద్యార్థుల విద్యాస్థాయి తగ్గకుండా చూడాలని HM గిరిబాబుకు సూచించారు. వెనుకబడిన విద్యార్థులకు తగు విధానంలో అదనపు తరగతులు బోధించాలన్నారు.