JGL: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, మెట్పల్లి మండల ఎంపీడీవో మోత్కూరు సురేష్ పేర్కొన్నారు. మెట్పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నూతనంగా భాద్యతలు చేపట్టిన మోత్కూరి సురేష్‌ను మండల కారోబార్లు మండల కార్యాలయంలో కలిశారు. అనంతరం వివిధ గ్రామపంచాయతీల కారోబార్లు ఆయనను శాలువతో సన్మానించారు. మెట్పల్లి డివిజన్ అధ్యక్షులు వాసాల రాములు పాల్గొన్నారు.