BHPL: జంగేడులోని ప్రభుత్వ SC బాలుర వసతి గృహంలో ఇవాళ సాయంత్రం MLA గండ్ర సత్యనారాయణ రావు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీతో కలిసి విద్యార్థులకు బ్లాంకెట్స్, స్వెటర్లు అందజేశారు. శీతాకాలంలో చలి ఇబ్బందులు తప్పించేందుకు ఈ చర్య తీసుకున్నారు. ప్రభుత్వ హాస్టల్స్లో అన్ని సౌకర్యాలు కల్పించడమే CM లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.