సత్యసాయి: సోమందేపల్లి మండలానికి ఈనెల 16న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రానున్నట్లు మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. సోమందేపల్లిలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.