VKB: ధారూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మండల వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు రూ.29,03,364 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్పీకర్ గడ్డం ప్రసాద్ పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఈ పథకాలు ఆసరాగా నిలిచాయన్నారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.