AP: విశాఖ సదస్సులో ఇప్పటివరకు మున్సిపల్ శాఖలో 32 ఒప్పందాలు జరిగాయని మంత్రి నారాయణ తెలిపారు. వివిధ విభాగాల్లో 41 అవగాహనా ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. అనుకున్నట్లే రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సీఐఐ సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.