బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై జన్ సూరజ్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డబ్బులకు ఓటర్లు అమ్ముడుపోయారని జన్ సూరజ్ పార్టీ ఆరోపించింది. ప్రజలకు తాము తీసుకొచ్చిన కొత్త రాజకీయం ఇంకా పూర్తిగా అర్థం కాలేదని వ్యాఖ్యానించింది. అభివృద్ధి, సంస్కరణలపై దృష్టి సారించిన తమ ప్రయత్నాన్ని ప్రజలు సరిగా గుర్తించలేకపోయారని తెలిపింది.