ఆచార్య వినోబా భావే మహాత్మా గాంధీకి ఆధ్యాత్మిక వారసుడు. ఈ గొప్ప గాంధేయవాది స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు. గాంధీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహానికి ఆయనే తొలి ఎంపిక. వినోబా భావే ముఖ్యమైన కృషి భూదానోద్యమం. అహింసతో దేశమంతా పాదయాత్ర చేసి.. భూస్వాములను కోరి పేదలకు లక్షలాది ఎకరాల భూమిని సేకరించి పంచిపెట్టారు. ఆయన సేవలకు మరణానంతరం భారతరత్న(1983) లభించింది.