బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. తుది ఫలితాల్లో NDA కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 243 స్థానాలకు గానూ NDA కూటమి ఏకంగా 203 స్థానాల్లో గెలుపొందింది. ప్రతిపక్ష మహాగఠ్బంధన్ కేవలం 34 నియోజకవర్గాలకే పరిమితమైంది. మిగిలిన 6 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. NDA కూటమి ఘన విజయంతో మరోసారి అధికారాన్ని చేపట్టనుంది.