బీహార్ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికలు ప్రారంభం నుంచే అవకతవకలు జరిగాయని, అందుకే విజయాన్ని అందుకోలేకపోయామని ఆరోపించారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జరిగిన పోరాటమని పేర్కొన్నారు. ఫలితాన్ని ‘ఇండి’ కూటమి, కాంగ్రెస్ సమీక్షించుకుంటాయని.. రాజ్యాంగ పరిరక్షణకు ఏం చేయాలో చర్చిస్తామని రాహుల్ తెలిపారు.