AP: భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, సీడీవో రేచస్ ఎల్లతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాక్సిన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని లోకేష్ కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని రేచస్ ఎల్ల తెలిపారు. కాగా మరోవైపు సీఐఐ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే.