ఢిల్లీ పేలుళ్ల కేసు నేపథ్యంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. J&K పోలీసులు, రాష్ట్ర వైద్య మండలి అందించిన వివరాల ఆధారంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్(NMC) కీలక చర్య తీసుకుంది. ఘటనకు బాధ్యులైన డాక్టర్లు ముజఫర్ అహ్మద్, అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ సయీద్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర వైద్య మండళ్లకు సమాచారం పంపారు.