వరంగల్ కోటలో కాకతీయ రాజు గణపతిదేవుడు నిర్మించిన పవిత్ర స్థలమైన శ్రీ స్తంబు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో కనీస సౌకర్యాలు లేవని స్థానిక ప్రజలు ఆరోపించారు. దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు నిత్యం దర్శనార్థం వచ్చే ఈ చారిత్రక దేవాలయంలో తగిన సౌకర్యాలు లేకపోవడం అత్యంత విచారకరమని వారు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.