NDL: అవుకులో ప్రభుత్వ ఉపాద్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. అవుకుకు చెందిన విజయ్ గత డీఎస్సీలో ఉద్యోగం సాధించి పాణ్యం గురుకుల పాఠశాలలో నెలక్రితం ఉద్యోగంలో చేరారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. విజయ్ మృతితో కుటుంబంతో పాటు అవుకులో విషాదం నెలకొంది.