ADB: అఖండ హరి నామ సప్త ముగింపు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్ గ్రామస్థులు ఈ నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను తమ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై భక్తులను ఉత్సాహపరచాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.