సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం భక్తులకు అటుకుల ఉగ్గానిని ప్రసాదంగా అందించారు. పుట్టపర్తికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించి, సాయి సేవలో నిమగ్నమయ్యారు. పుట్టపర్తిలోని 12 ప్రాంతాల్లో అన్నదాన సేవ కొనసాగుతోంది.