KDP: కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట్ల రోడ్డులో గల సబ్‌స్టేషన్‌కు చెందిన ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. శుక్రవారం ప్రొద్దుటూరు డివిజనల్ ఇంజనీర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. మండల సర్వేయర్ కొలతలు వేయగా, ఆ స్థలం ప్రభుత్వానికే చెందిందని నిర్ధారణ అయింది. MRO ద్వారా నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు.