ASR: కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామంలో పాఠశాల ప్రారంభించాలని మంగళవారం హిట్ టీవీలో వచ్చిన వార్తకు స్పందన లభించింది. అధికారులతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. గురువారం డీఈవో పీ.బ్రహ్మాజీరావు, ఎంఈవో ఎల్.రాంబాబు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పాఠశాలను ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు థింసా నృత్యం చేసి హర్షం వ్యక్తం చేశారు.