NLR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావుకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గురువారం ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా పర్యటన నిమిత్తం నెల్లూరుకు వచ్చిన ఆయనను జాయింట్ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పీడీఎస్ దుకాణాలు, ఐసీడీఎస్, మధ్యాహ్నం భోజన పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పాఠశాలల పనితీరు గురించి చర్చించుకున్నారు.