WNP: క్రీడలు క్రమశిక్షణ, స్పూర్తి, ఓర్పును నేర్పిస్తాయని జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. ఇవాళ చిట్యాల గ్రామ శివారులోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాస్థాయి క్రీడల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలతో పాటు క్రీడల్లో కూడా విజయం సాధించాలన్నారు.