TG: తెలంగాణ సాధనలో సోనియా గాంధీ చేసిన పాత్రను TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. ‘సోనియా మహా దేవత లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు’ అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మహేష్.. త్వరలో లింబాద్రి గుట్ట, సిద్దుల గుట్ట వద్ద పర్యాటక గెస్ట్ హౌస్‌ను నిర్మిస్తామన్నారు. బోధన్‌లో పామాయిల్ ఫ్యాక్టరీ స్థాపిస్తామన్నారు.