WGL: నెక్కొండ మండల కేంద్రంలోని బస్టేషన్ ఆవరణలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన వెంకటేశ్వర్లు, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.2.50 లక్షల విలువైన 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడిలో SI మహేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.