MBNR: మహిళలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మూసాపేట్ మండలానికి చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు.