WGL: విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, మానసిక దృఢత్వం పెంపొందించేందుకు ‘స్ఫూర్తి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు. భయాన్ని జయిస్తే ఏదైనా సాధించొచ్చు అని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు.