AP: అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో విషాదకర ఘటన జరిగింది. డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్ స్విమ్మింగ్ పూల్లో పడి విద్యార్థి మృతి చెందాడు. మృతుడు ఒకటో తరగతి చదువుతున్న మోక్షిత్గా గుర్తించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులుస్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు.