NLR: సంగం పట్టణములో గురువారం రాత్రి ఎస్సై రాజేష్ వాహదారులకు ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వెహికల్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఇటీవల జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో జరుగుతున్న వాహన ప్రమాదాల దృష్ట్యా వాహనదారులకు పలు విషయాలు తెలియజేశారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు.