AKP: మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీ గురువారం కోటవురట్లకు చేరింది. రామచంద్రపురం, గొట్టివాడ, కైలాసపట్నం మీదుగా మధ్యాహ్నం కోటవురట్ల చేరుకుంది. ఇక్కడ టీడీపీ నాయకులు లాలం కాశీనాయుడు, జానకి శ్రీను, ఎంపీటీసీ బాబు వారికి స్వాగతం పలికారు.