నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ గురువారం స్థానిక 35/1 రాజీవ్ గృహకల్ప సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్, ఆన్లైన్ అటెండెన్స్ పలు రికార్డులను తనిఖీ చేశారు. పనివేళల యందు ప్రజలకు కార్యదర్శులు అందరూ అందుబాటులో ఉండాలని, ప్రతి రోజు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.