ప్రకాశం: మార్కాపురం పట్టణంలో గురువారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేసిన పత్రాలను ఎమ్మెల్యే నారాయణరెడ్డి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని ఆయన విమర్శించారు. ఒక్కొక్క పథకాన్ని ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు.