ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నాదెండ్ల సుబ్రహ్మణ్యం గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం మృతిచెందడంతో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుడిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగినట్లు పలువురన్నారు.