JN: పాలకుర్తి మండలంలోని ప్రసిద్ధ ప్రాచీన దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి దిశగా కీలక చర్యలు చేపడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. గురువారం ఆలయాన్ని అధికారులతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిఅధికారులు, దేవస్థాన ఈవో విస్తృతంగా చర్చించారు.