AP: మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ. 400 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు అయిన ఖర్చులు చెల్లిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.