KDP: గ్రామాల్లో నెలకొన్న అపారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పులివెందుల ఎంపీడీవో కృష్ణమూర్తి సూచించారు. గురువారం పులివెందులలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు సిబ్బంది పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.