SKLM: నూతనంగా నియామకమైన గ్రామస్థాయి బూత్ లెవెల్, క్లస్టర్ మండల స్థాయి కమిటీలు బాధ్యతతో పనిచేయాలని టెక్కలి నియోజకవర్గం TDP పరిశీలకులు కొండపల్లి అప్పలనాయుడు పేర్కొన్నారు. గురువారం కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్లో ఆయా కమిటీలు కార్యవర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఎన్టీఆర్, ఎర్రమనాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.